ఏలూరు జిల్లా పోలవరం: మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అధికారిక పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘనంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు.
పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రితో కలిసి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పోలవరం ప్రాజెక్టు పనులను సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, ప్రస్తుత సమస్యలు, కొనసాగుతున్న పనులపై ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో పాటు ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని, ఇందుకు అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
సమీక్ష సమావేశం అనంతరం, రేపు జరగనున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో కేక్ కట్ చేసి ఆప్యాయంగా ముచ్చటించారు.
ముఖ్యమంత్రి స్వయంగా ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రివర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పోలవరం పర్యటనలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు https://t.co/MIK5XYcUuE
— ELURU NEWS (@EluruNews90170) January 7, 2026















Social Plugin