నిరు పేదలకు అత్యధికంగా ఇళ్ల పట్టాలు పంచిన మహానుభావుడు పాలడుగు వెంకట్రావు


మంత్రివర్యులు కొలుసు పార్థసారధి


నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు టౌన్ రాజీవ్ సర్కిల్ వద్ద నిర్మించిన  మాజీ మంత్రి స్వర్గీయ పాలడుగు వెంకట్రావు  విగ్రహ ఆవిష్కరణ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ నూజివీడు అనగానే గుర్తుకొచ్చేది పాలడుగు వెంకట్రావు అని గుర్తుచేశారు. నాడు మంత్రిగా ఉన్న అనతికాలంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అత్యధికంగా ఇళ్ళ పట్టాలు పంచిన మహానుభావుడని గుర్తుచేశారు. 

తమ జీవితాంతం పేద ప్రజల ఉన్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు. నూజివీడు నియోజకవర్గంలో ఎక్కువ శాతం అటవీ భూముల ఉండడంతో వ్యవసాయ సాగు కోసరం పేదలకు పట్టాలు ఇవ్వమని ప్రభుత్వంతో పోరాడిన గొప్ప వ్యక్తి వెంకట్రావు అన్నారు. నాడు  నూజివీడు పట్టణానికి ఇండోర్ స్టేడియం తెచ్చిన వ్యక్తి అని గుర్తుచేశారు. నేడు సుమారు. రూ.1.80 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని త్వరలో అందరికీ అందుబాటులో ఉంటుందని గుర్తుచేశారు. 

ఆయన శిస్యులు అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారని వారి కోరిక మేర విగ్రహాన్ని అవిష్కరించామని తెలిపారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. నాడు మల్లవల్లి పారిశ్రామిక పార్క్ రావడానికి నావంతు కృషి ఉందని వెంకట్రావు గారి ఆలోసన అంతా నూజివీడు అభివృద్ధి పైనే ఉండేదని గుర్తుచేశారు. తమ జీవితాంతం పేద ప్రజలకు అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వెంకట్రావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.