-103 ఫిర్యాదులను మంత్రి దృష్టికి తెచ్చిన ప్రజలు..
-ప్రతి సమస్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ఆదేశించిన మంత్రి
ఏలూరు జిల్లా, నూజివీడు/ముసునూరు: నియోజకవర్గం, ముసునూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు 103 ఫిర్యాదులను మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రతి ఫిర్యాదును మంత్రి ఓపికగా విని, సదరు సమస్య ఏ శాఖకు సంబంధించినదో పరిశీలించి సంబంధిత అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు మంత్రి దృష్టికి వచ్చిన ఫిర్యాదుల్లో రెవెన్యూశాఖకు సంబంధించినవి 40 అర్జీలు, పెన్షన్లకు సంబంధించినవి 30అర్జీలు, హోంశాఖకు సంబంధించిన 4, హౌసింగ్ కు సంబంధించినవి 6, హెల్త్ కు సంబంధించినవి 1, పంచాయతీరాజ్ కు సంబంధించినవి 3, ఆర్ అండ్ బి కి చెందినవి 2, విద్యుత్ శాఖకు సంబంధించినవి 4 అర్జీలు మంత్రి దృష్టికి వచ్చాయి.
ఇవి కాకుండా చెక్కపల్లి గ్రామంలో రైతుల పొలం రికార్డులు రీసర్వేలో భాగంగా రికార్డులు తారుమారు కావడంతో 300ఎకరాల చెరువు భూమిగా మారిందని రైతులు తమ సమస్యను మంత్రికి వివరించారు. ఈ సమస్యపై మంత్రి వెంటనే సబ్ కలెక్టర్ కు ఫోన్ చేసి తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దాదాపు 5 గంటల పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం, పరిష్కార మార్గం చూపడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
ముసునూరులో మంత్రి పార్థసారథి గారి ప్రజాదర్బార్ కు విశేష స్పందన... https://t.co/AscB8u7ChN
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026















Social Plugin