ఎన్టీఆర్ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


ఏలూరు జిల్లా,ఏలూరు: తెలుగునాట తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రులందరిలో రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు అని, ఆయన కీర్తి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కొనియాడారు.


టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బడేటి చంటితో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి మాగంటి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

తొలుత దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి భారీ గజమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనమని, తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలందరిలో రాజకీయ చైతన్యాన్ని నింపిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆ మహానేత స్ఫూర్తిని కొనసాగిస్తూ సుపరిపాలనకు నాంది పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలో తామంతా నడవడం గర్వంగా ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్ పెదబాబు, పార్టీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గూడవల్లి వాసు, పార్టీ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్ పాల్గొన్నారు.

అలాగే నాయకులు బెల్లపుకొండ కిషోర్, ఆల్ ఇండియా బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిబిజి తిలక్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జీలు, డివిజన్ ఇంచార్జీలు, ఎన్టీఆర్ అభిమానులు, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.