పండుగల ద్వారానే సంస్కృతి తరతరాలకు చేరుతుంది: ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ


తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం: ISTS మహిళా కాలేజీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.


విద్యార్థులు గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సంప్రదాయాలు, విలువలు తదుపరి తరాలకు చేరుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇటువంటి పండుగ వేడుకలు విద్యార్థుల్లో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంతో పాటు భారతీయ సంప్రదాయాలపై గౌరవాన్ని కలిగిస్తాయన్నారు.

అనంతరం కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ని, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ని దుశ్శాలువాలతో సత్కరించింది.

ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.