ఎన్‌టీఆర్ జిల్లా, విజయవాడ: ఫెడరేషన్ ఆఫ్ కమ్యూనిటీ పారామెడిక్స్ అసోసియేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం విజయవాడ రామకృష్ణపురంలోని ఆర్ఎంపీ సామాజిక భవనంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు రొక్కం నాగేశ్వర రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ పూర్వ అధ్యక్షులు వీబీటీ రాజు, పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్. రాజు ముఖ్య అతిథులుగా హాజరై సమావేశానికి ప్రత్యేక శోభను చేకూర్చారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ పారామెడిక్స్ ఎదుర్కొంటున్న అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ నాయకులు తమ తమ ప్రాంతాల్లో అవయవదానం, జీవన్‌దాన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తొలి తీర్మానంగా నిర్ణయించారు.
అలాగే ఫెడరేషన్ సమావేశాలను అన్ని జిల్లాల్లో ఉన్న సంఘాల ఆధ్వర్యంలో, ఆయా జిల్లా నాయకత్వంలో నిర్వహించాలని రెండవ తీర్మానంగా ఆమోదించారు. దీనివల్ల జిల్లాస్థాయి సంఘాలకు మరింత బలాన్ని చేకూర్చాలని అభిప్రాయపడ్డారు.
ఫెడరేషన్‌లో భాగమైన ప్రతి సంఘం నుంచి ఐదుగురిని కార్యవర్గ సభ్యులుగా నియమించాలని మూడవ తీర్మానంగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఫెడరేషన్ కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, కోశాధికారి కే. కృష్ణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాజా వలి, ఉపాధ్యక్షులు ఎం. శేషసాయి, సహాయ కార్యదర్శి ఎం. జయరామ్‌తో పాటు తోరాటి ప్రభాకరరావు, ఎస్. వేణుగోపాల్, కే. జనార్దన్, ఏఆర్కే పరమేశ్వరులు, ఎం. దామోదర్ రెడ్డి, పి. దేవానందం, సత్తార్, నాగ మల్లేశ్వరరావు, వెంకట నర్శయ్య, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, టి. నరసింహరావు, ఎం. సుబ్బారాయుడు, జి. శివరామకృష్ణ, పి. చంద్రశేఖర్, ఎన్. రవి, ఎస్‌కే బాబు, జి. లక్ష్మణ్, ఎస్‌కే బషీర్, ఎం. సాంబశివరావు, వి. అంకిరెడ్డి, వీరశేఖర్, హనుమంతరావు, ఎన్. శ్రీరామమూర్తి, వెంకటేశ్వర రెడ్డి, కె. బ్రహ్మానందం, పి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ పారామెడిక్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం – కీలక తీర్మానాలు ఆమోదం https://t.co/vFxM3zt8yO
— ELURU NEWS (@EluruNews90170) January 7, 2026















Social Plugin