చనుబండ గ్రామంలో ఘనంగా నూతన సంవత్సరం 2026 వేడుకలు – 700 మందికి పైగా ప్రజలకు అల్పాహార విందు


ఏలూరు జిల్లా,చాట్రాయి, చనుబండ: నూతన సంవత్సరం 2026 సందర్భంగా చనుబండ గ్రామపంచాయతీలో జనవరి 1న ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు చీదురాల మాధవరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్పాహార విందును ఏర్పాటు చేశారు.


మాజీ ఎంపీపీ కందుల కృష్ణ నివాసం సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలకు చికెన్, గారెలు, ఉప్మా, స్వీట్స్, టీ తదితర అల్పాహార పదార్థాలను అందించారు. ఈ విందుకు సుమారు 700 మందికి పైగా గ్రామస్తులు హాజరై పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, చీదురాల మాధవరావు మరియు కందుల కృష్ణ గ్రామ, మండల రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలందిస్తూ, ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ప్రజల ఆదరణ పొందారని కొనియాడారు. అటువంటి నాయకులను గౌరవించడం, అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

నూతన సంవత్సరం ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి, చాట్రాయి బీజేపీ మండల అధ్యక్షులు ఓబెల్లనేని రాజా, చీదురాల మాధవరావుని మరియు మాజీ ఎంపీపీ కందుల కృష్ణని పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, 2026 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మోదుగు ముత్తయ్య, నక్క చెన్నారావు, శ్రీహరి, నారాయణరావు, పర్యవేక్షణలో అద్భుతరావు, దార్ల సురేష్, కాంతారావు, బొట్టు దుర్గారావు, రమేష్, శ్రీరామ్, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.