చాట్రాయి: మండలం చనుబండ గ్రామంలో గురువారం నిరుపేదల నడుమ విలక్షణ రీతిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నడిపల్లి వెంకట కిషోర్–శిరీష దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పేదలతో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా నడిపల్లి వెంకట కిషోర్, శిరీష దంపతులు తమ కుమారుడు హర్షిత్, కుమార్తె మనస్వితతో కలిసి గ్రామంలోని నిరుపేదలకు నూతన వస్త్రాలు, న్యూట్రిషన్ ఫుడ్‌ను పంపిణీ చేశారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపిన ఈ కార్యక్రమం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.
నడిపల్లి వెంకట కిషోర్ మాట్లాడుతూ, “పేదల సమక్షంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేడుకలు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటనగా నిలుస్తాయి” అని అన్నారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంతో మానవత్వం, సేవాభావం ఎంత ముఖ్యమో చాట్రాయి మండల ప్రజలకు మరోసారి గుర్తు చేసినట్లయ్యింది.
_11zon.png)














Social Plugin