ఇజ్రాయిల్ పేటలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


 

ఇజ్రాయిల్ పేటలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆర్టీసీ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్

ఏలూరు | జనవరి 26:
రాజ్యాంగం ప్రతి పౌరునికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిన గొప్ప గ్రంథమని, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్టీసీ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.

స్థానిక 47వ డివిజన్ పరిధిలోని ఇజ్రాయిల్ పేటలో, పిల్ల టిడిపి క్రిస్టియన్ అధ్యక్షులు జుంజు మోజేష్ అధ్యక్షతన నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

జాతీయ పతాకావిష్కరణ – ప్రముఖులకు నివాళులు

తొలుత గ్రామ పెద్దలు, సంఘస్తులు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహాత్మా గాంధీ, డా. బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం : రెడ్డి అప్పలనాయుడు

ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ,
ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని, దేశ పౌరుల హక్కులను పరిరక్షించడంలో ఇది కీలక పాత్ర పోషించిందన్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం ఆ కాలానికి అనుగుణంగా, ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగంగా నిలిచిందని కొనియాడారు.

కొన్ని ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ పాలన చేయాలని ప్రయత్నించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ విలువలను కాపాడటమే ప్రతి పౌరుడి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

గణతంత్ర దినోత్సవం – బాధ్యతను గుర్తు చేసే రోజు

గణతంత్ర దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన బాధ్యతలను గుర్తుచేసుకునే రోజని అన్నారు. ప్రజాసేవనే రాజకీయాల పరమార్థంగా భావిస్తూ, రాజకీయాల్లో విలువలు–నైతికత–జవాబుదారితనాన్ని తిరిగి తీసుకొచ్చిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజ్యాంగ స్ఫూర్తితో పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. యువతకు అవకాశాలు కల్పిస్తూ, పేదలకు అండగా నిలిచే నిర్ణయాలే నిజమైన గణతంత్ర స్ఫూర్తికి నిదర్శనమని తెలిపారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ, రాజ్యాంగ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బలమైన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

స్వేచ్ఛ–సమానత్వమే రాజ్యాంగ మూలసూత్రాలు : శిరిపల్లి ప్రసాద్

మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ,
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మూలసూత్రాలతో భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కులం, మతం, వర్గం, భాష భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని చెప్పారు.

అంబేద్కర్ ఆశయాల దిశగా సమాజం ముందుకు సాగాలి

జిల్లా టిడిపి క్రిస్టియన్ అధ్యక్షులు జుంజు మోజేష్, మాజీ కో–ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్ మాట్లాడుతూ,
అన్ని రకాల వివక్షలకు దూరంగా, సమానత్వ భావనతో జీవిస్తూ డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారత సమాజం ముందుకు సాగాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే అన్ని సంక్షోభాలకు పరిష్కారమని అన్నారు.

విశేషంగా పాల్గొన్నవారు

ఈ కార్యక్రమంలో ఇజ్రాయిల్ పేటకు చెందిన పెద్దలు,
మార్లపూడి పౌలు రాజు (మాజీ బ్రేక్ ఇన్స్పెక్టర్), వీరపోగు యోహాను పాస్టర్, దుగ్గిపోగు యోహాను పాస్టర్, కోలా కిరణ్ పాస్టర్, కత్తి బాబ్జి పాస్టర్, కోలా మధుబాబు (జుడిషియల్ డిపార్ట్మెంట్), దుగ్గిపోగు జాన్, కంభంపాటి రాజు (సోషల్ వెల్ఫేర్), సలహాదారులు కొమ్ముల రాజేష్, కడిమి యౌహాను, యూత్ ప్రెసిడెంట్ తోట కిషోర్, జనసేన నాయకులు సానాసి వెంకట రమణతో పాటు గ్రామ పెద్దలు, సంఘస్తులు, మతపెద్దలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.