ఏలూరు జిల్లా, చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కేంద్రంలో ఉన్న టౌన్ సీఎస్ఐ చర్చ్‌తో పాటు బోయగూడెం ఆర్‌సీఎం చర్చ్‌లలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ గారు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ప్రార్థనలు ముగిసిన అనంతరం సీఎస్ఐ, ఆర్‌సీఎం చర్చ్ పెద్దలు ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారిని, ఆయన సతీమణి విజయ గారిని, పిల్లలు మాగ్నస్ సొంగా, మార్వెల్ సొంగా లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ, 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడం ప్రతి ఒక్కరికీ అదృష్టమని, ఈ సంవత్సరం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేపట్టిన కార్యక్రమాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని అన్నారు.
అనేక మంది పేద కుటుంబాలు ఆరోగ్య చికిత్సల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్న సందర్భాల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా కొంతవరకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని చెప్పారు. అలాగే ఎల్ఓసి (LOC) సౌకర్యం ద్వారా ముందుగానే వైద్య ఖర్చులు పొందుతూ చికిత్స చేయించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పథకాల వల్ల ప్రజల ముఖాల్లో సంతోషం చూడగలుగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, చర్చ్ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















Social Plugin