ఏలూరు జిల్లా చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీకి చెందిన కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ కృష్ణ వరప్రసాద్‌కు రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు చిగురుపాటి కుమారస్వామి గన్నవరంలో అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కృష్ణ వరప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి నాయకుడు చిగురుపాటి కుమారస్వామి చేతుల మీదుగా నియామక పత్రం స్వీకరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం బీజేపీ కిసాన్ మోర్చా తరఫున మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
అలాగే ఈ అవకాశాన్ని తనకు కల్పించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు విక్రమ్ కిషోర్ కి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కీర్తి రాంప్రసాద్ కి కృష్ణ వరప్రసాద్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కిసాన్ మోర్చా ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.















Social Plugin