వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసే పంచసూత్రాలు, వాణిజ్య పంటలపై రైతులకు సూచనలు
ఆయిల్ పామ్ విప్లవానికి పునాది పెట్టిన ఎన్టీఆర్ స్ఫూర్తితో— వ్యవసాయ ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వ అంకితభావం
ఏలూరు జిల్లా, దెందులూరు 03: "రైతన్నలకు అండగా నిలుస్తూ కూటమి ప్రభుత్వం చేపట్టిన "రైతన్నా...మీకోసం" కార్యక్రమాన్ని పెదవేగి మండలం విజయిరాయిలోని రైతు సేవ కేంద్రం వద్ద రైతన్నలతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతన్న మీకోసం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రైతులకు, స్థానిక ఉద్యానవన విద్యార్థులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా అందజేసి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడం కోసం రైతులు చేపట్టవలసిన నూతన మార్పులను సైతం వివరించారు...
ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ "రైతులకు వ్యవసాయాన్ని గిట్టుబాటుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పంచ సూత్రాలను అమలు చేస్తుందని, వీటిపై ఇప్పటికే గ్రామస్థాయిలో రైతులకు వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే సాంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆదాయాన్నిచ్చే అంతర్ పంటలను సైతం రైతులు సాగు చేస్తూ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని సైతం వ్యవసాయ రంగంలో ఉపయోగించుకోవాలనిఅన్నారు. ఆయిల్ పామ్, కోకో వంటి వాణిజ్య పంటలను సైతం రైతులు సాగు చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. అదేవిధంగా వ్యవసాయంలో ద్రోణు వంటి పరికరాల సేవలను సైతం రైతులు ఉపయోగించుకోవాలని, ఉన్నత చదువులు చదివిన రైతుల బిడ్డలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపన దిశగా అడుగు ముందుకు వేయాలని తెలిపారు.
ఈనాడు రైతులకు ఎంతో లాభసాటిగా మారిన ఆయిల్ ఫామ్ సాగును తొలిసారిగా రాష్ట్రానికి తీసుకువచ్చి, రాష్ట్రంలోనే తొలి మొక్కను మన పెదవేగి మండలంలో నాటి ఈనాటి ఆయిల్ సాగు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావుని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ కు తార్కాణమే ఆనాడు విదేశాల్లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని మన రాష్ట్రంలో ప్రవేశ పెట్టడమని అన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని విధాల అండగా నిలుస్తున్నామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, రైతులు, పలువుల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు















Social Plugin