జీలుగుమిల్లి మండలం రాచన్న గూడెం గ్రామంలో పోలీసుల 'పల్లె నిద్ర'.


చట్టాలు, సైబర్ భద్రతపై అవగాహన కల్పించిన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వారి యొక్క సిబ్బంది..


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి: ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మరియు భద్రతా అంశాలపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన 'పల్లె నిద్ర' కార్యక్రమాన్ని రాచన్న గూడెం గ్రామంలో నిర్వహించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు యొక్క ఆదేశాలపై జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ ఈ కార్యక్రమంను నిర్వహించారు. జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్  వెంకటేశ్వర రావు, ఎస్ఐ క్రాంతి మరియు వారి సిబ్బంది గ్రామస్తులతో కలిసి రాత్రి గడిపారు.

ఈ కార్యక్రమం గ్రామస్థులకు భద్రత, చట్టపరమైన రక్షణలు, సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు గ్రామస్తులకు అత్యంత ముఖ్యమైన సామాజిక మరియు చట్టపరమైన అంశాలపై వివరణాత్మక అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు (డ్రగ్స్) బానిసలు కాకుండా ఉండేందుకు, వాటి వల్ల కలిగే ఆరోగ్యపరమైన, సామాజికపరమైన నష్టాల గురించి వివరించారు.

పిల్లలపై లైంగిక దాడులు జరగకుండా రక్షణ కల్పించే పోక్సో చట్టంలోని నిబంధనలు మరియు దాని ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు వివరించారు. సైబర్ నేరాలు (Cyber Crimes) ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలు, ఓటీపీ (OTP) మోసాల గురించి వివరించి, సైబర్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శక్తి యాప్ (Shakti App) మహిళల భద్రత కోసం ఉద్దేశించిన శక్తి యాప్ వినియోగం మరియు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలో సిబ్బంది ప్రత్యక్షంగా చూపించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామస్తులు చురుగ్గా పాల్గొన్నారు. తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ 'పల్లె నిద్ర' కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువయ్యారని, భద్రతా అంశాలపై మంచి అవగాహన కలిగిందని అధికారులు తెలియ చేసినారు.