గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో వైభవంగా హనుమద్ హోమం

కొవ్వూరు 9వ అదనపు జిల్లా సెషన్ జడ్జి శ్రీమతి ఎం. అనురాధ వారి దంపతులు

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం: గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో హనుమద్ హోమం భక్తి భావంతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

దేవస్థానం ప్రతీ ఆదివారం ఈ హనుమద్ హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ హోమంలో ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని పాల్గొనేవారికి మానసిక–శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, విద్యార్థులకు విద్యాభివృద్ధి, కుటుంబ కల్యాణం, దాంపత్య ఆనందం, సంతాన ప్రాప్తి, సర్వత్ర విజయాలు కలుగుతాయని విశ్వాసం ఉంది.

భక్తులందరూ ప్రతీ ఆదివారం జరిగే ఈ పవిత్ర హనుమద్ హోమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని ఆలయ సహాయ కమిషనర్ & కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి. చందన పిలుపునిచ్చారు.