చింతలపూడి లారీ, ట్రాక్టర్, ఆటో, కార్, ఎలక్ట్రిషన్ మెకానికుల కార్తీక ఆనంద హేళ


ఏలూరు జిల్లా, చింతలపూడి: పట్టణంలో దుడే సత్యనారాయణ మామిడి తోటలో శ్రీ మహాత్మా గాంధీ ట్రాక్టర్ ఆటో కార్ ఎలక్ట్రిషన్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో మెకానికుల కార్తీక వన సమారాధన ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది. ఈ కార్యక్రమం యూనియన్ ప్రెసిడెంట్ తోట శివ నాగరాజు (నాని) మాట్లాడుతూ మెకానిక్ లో చింతలపూడి పట్టణంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, చింతలపూడి ప్రజలకు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఆటోనగర్ సాంక్షన్ చేయాలని అన్నారు. 


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతలపూడి మండల జనసేన నాయకులు చీదరాల మధుబాబు మెకానికులకు కావలసినటువంటి సకల సౌకర్యాలు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సమకూరుస్తుందని యూనియన్ సభ్యులు అందరూ ఐకమత్యంగా ఉంటే మీ అందర్నీ కలుపుకొని రానున్న కాలంలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని సమకూరుస్తారని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు కొత్తపూడి శేషగిరిరావు మాట్లాడుతూ మీకు కావాల్సిన సౌకర్యాలు చేయడంలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే చింతలపూడిలో స్థలాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. 

పట్టణ టిడిపి అధ్యక్షులు తాటి అప్పారావు మాట్లాడుతూ మనందరం ఐక్యమత్యంగా ఉంటే తప్పనిసరిగా మీకు కావలసిన సౌకర్యాలు అన్ని ఎంపీ మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తప్పనిసరిగా సాధించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచినపల్లి రాఘవేంద్రరావు, ఫౌండ్రి యూనియన్ ప్రెసిడెంట్ సింగంశెట్టి శివకుమార్, ట్రాక్టర్ అండ్ మెకానిక్ యూనియన్ సెక్రటరీ చిన్నాల రాంబాబు, కోశాధికారి కంకిపాటి రామరాజు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.