ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు....
ఏలూరు జిల్లా, ఏలూరు: ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నగర మహాసభను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం నందు గోవాడ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు 12వ పిఆర్సి ప్రకటించి, 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, మరణించిన రిటైర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో కుటుంబ సభ్యులను ఔట్సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ కార్మికులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు పదవి విరమణ వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు.
ఏలూరు నగరంలో మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి, మున్సిపల్ కాలనీ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరంలో 11, 30 డివిజన్ లలో పారిశుద్ధ్య పనులు ప్రైవేటీకరణకు నగరంలో శ్రీకారం చుట్టారని అది చాలక, మరో రెండు డివిజన్లు ప్రైవేటుపరం చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఖాళీగా ఉన్న పోస్టులను అప్కాస్ విధానం ద్వారానే భర్తీ చేసి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా అపరిశుభ్రతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో కలిసొచ్చే యూనియన్ లతో సమావేశాలు ఏర్పాటు చేసి ఏలూరు నగరంలో పనులను నిలిపివేసి సమ్మె చేయడానికి వెనకాడబోమని ఈ సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో వంశీ, కాకాని సుబ్బారావు, గూడుపు దుర్గారావు, ముద్ర బోయిన భాస్కరరావు, బంగారు గురు ప్రసాద్, దేవేంద్ర లోకేశ్వరరావు, అల్లం పెద్దిరాజు, అంతరాజ్ లీల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.















Social Plugin