ఏలూరు, ఏలూరు జిల్లా, దెందులూరు మండలం: విద్యార్థులకు మెరుగైన విద్యా ప్రమాణాలను అందించడంతో పాటు, విజ్ఞాన యాత్రల ద్వారా వారికి మరింత జ్ఞానం అందిస్తూ, వారి బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుంది” అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం కొవ్వలిలోని SVSRB జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన యాత్ర బస్సును దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని ఎమ్మెల్యే స్వీకరించారు. విజ్ఞాన యాత్రలో భాగంగా అమరావతి రాజధానిలోని కీలక ప్రాంతాలతో పాటు పలు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి యాత్రలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
విద్యార్థుల యాత్ర క్షేమంగా జరగేలా సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా, విజ్ఞాన యాత్రకు బయలుదేరే ముందు విద్యార్థులందరికీ దుగ్గిరాల్లోని ఎన్టీఆర్–చింతమనేని జనతా క్యాంటీన్ ఆధ్వర్యంలో అల్పాహార విందును ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం పెదవేగి మండలం రాట్నాలకుంట లోని శ్రీ రాట్నాలమ్మ అమ్మవారిని ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఆలయ పాలకవర్గ చైర్మన్ మన్నే శ్రీనివాస్ కండువా కప్పి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారితో కలిసి ప్రముఖ న్యాయవాది మాగంటి లక్ష్మణ్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

















Social Plugin