ANDRAPRADESH, ఏలూరు జిల్లా, ఏలూరు: జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాద్ గారు కారుణ్య నియామకాల కింద ఇద్దరుగా ఎంపికైన ఆఫీస్ సబ్‌ఆర్డినేట్లకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ మల్లం సూర్య చరణ్ తేజ గారికి ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో, శ్రీ తాళ్లురి అభి శ్రీ గారికి లింగపాలెం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టింగ్‌లు ఇవ్వబడ్డాయి.
కారుణ్య నియామకాలు కుటుంబాలను ఆపదలో నిలబెట్టే కీలక ప్రభుత్వ విధానమని చైర్‌పర్సన్ శ్రీమతి పద్మశ్రీ అభిప్రాయపడ్డారు. ఈ నియామకాలుతో బాధిత కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా లభిస్తుందని ఆమె పేర్కొన్నారు. కొత్తగా నియమితులు ప్రజాసేవ పట్ల నిబద్ధత, కర్తవ్యనిష్ఠతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీ ఎం. శ్రీహరి గారు పాల్గొని నియామక పత్రాలను అందజేశారు. కార్యాలయ సిబ్బంది, అధికారులు హాజరై కొత్తగా నియమితులైన సిబ్బందిని అభినందించారు.















Social Plugin