సైబర్ నేరాలు, మత్తు పదార్థాలపై villagers కు అవగాహన
శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్య సూచనలు చేసిన పోలీసులు
ఏలూరు జిల్లా, చింతలపూడి, వెంకటాపురం: జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆదేశాల మేరకు, చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో, ఎస్ఐ సతీష్ నిన్న రాత్రి చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నివారణ, సైబర్ నేరాలు మరియు మత్తు పదార్థాల ప్రమాదాలపై ముఖ్య సూచనలు చేశారు. గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ పోలీసులు గ్రామంలో సామరస్య వాతావరణం కొనసాగించాలని సూచించారు.
కీలక సూచనలు & అవగాహన అంశాలు:
➡️ గ్రామస్థాయిలో చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని, తీవ్రమైన విషయాలను పోలీసులకు తెలపాలని ఇన్స్పెక్టర్ సూచించారు.
➡️ సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో, లోన్లు–ఉద్యోగాలు పేరుతో వచ్చే నకిలీ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
➡️ సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కి ఫిర్యాదు చేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
➡️ మత్తు పదార్థాల వినియోగం, అమ్మకం, నిల్వ వంటి చర్యలు ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాకుండా చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని హెచ్చరించారు.
➡️ ఎవరైనా డ్రగ్స్ లేదా అనధికార మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్టు తెలిసినా 1972 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
➡️ నాటు సారా తయారీ–అమ్మకాలపై సమాచారం దొరికినా డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కి తెలియజేయాలని చెప్పారు.
పల్లె సీమల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా, ప్రజలు సుఖసంతోషాలతో ఉండే విధంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతలే తమ ముఖ్య లక్ష్యమని చింతలపూడి ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు.















Social Plugin