పంచామృతాభిషేకంలో భక్తుల సందడి
సేవల రూపేణా రూ.1.30 లక్షల ఆర్జన – 1650 మందికి అన్నదానం
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం: గురవాయిగూడెం గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువుగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారాలయంలో ఈ రోజు శనివారం ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఉదయం గంట 8.00 నుండి ఆలయ ముఖ మండపంలో అర్చకులు, వేదపండితుల ఆద్వర్యంలో పంచామృతాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిదర్శనం పొందారు.
మధ్యాహ్నం గం.03.30 వరకూ స్వామివారి ఆలయానికి భక్తులు వివిధ సేవల రూపేణా మొత్తం **రూ.1,30,848/-**లు సమర్పించారు. స్వామివారి నిత్య అన్నదాన సత్రంలో సుమారు 1650 మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ, నీటి సౌకర్యం తదితర విషయాలలో అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ & కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి. చందన తెలిపారు.















Social Plugin