ఏలూరు జిల్లా, నూజివీడు: డివిజన్ పరిధిలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం (ఏపీ) ఆధ్వర్యంలో నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి ఏరియా గ్రామీణ వైద్యుల సోదర–సోదరీమణులకు విజయవాడ భాను హాస్పిటల్ వారి సహకారంతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథులుగా పర్మనాలజిస్ట్ డాక్టర్ భాను ప్రకాష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ రామ్ చైతన్య కొత్తపల్లి, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నికిత శ్రీరామనేని హాజరై వివిధ వ్యాధులు, వాటి లక్షణాలు, ప్రాథమిక చికిత్సా విధానాలపై గ్రామీణ వైద్యులకు అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైతం సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, ఏరియా నాయకులు పాల్గొనడంతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామీణ వైద్యులు హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.















Social Plugin