ఏలూరు, డిసెంబర్ 15 : జిల్లాలో రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఎరువుల విక్రయానికి సంబంధించి రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ, అధిక ధరలకు ఎరువులు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
జిల్లాకు రబీ 2025–26 గాను మొత్తం 52,962 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 5,644 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు చేరుకున్నాయని, అలాగే 01.10.2025 నాటికి అవసరమైన ఎరువుల నిల్వలు గోదాముల్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
01.10.2025 నుండి 31.12.2025 వరకు జిల్లాకు మొత్తం 24,108 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని, ఇప్పటివరకు 26,327 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండటం వల్ల రైతులకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అలాగే 01.10.2025 నుండి 15.12.2025 వరకు ఏలూరు జిల్లాలో 13,312 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు జరిగినట్లు తెలిపారు.
15.12.2025 నాటికి రాబోయే 17 రోజులకుగాను జిల్లాకు అవసరమైన ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 5,607 మెట్రిక్ టన్నుల ఎరువులు గోదాముల్లో నిల్వగా ఉండగా, 13,015 మెట్రిక్ టన్నుల ఎరువులు ఆర్ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, రిటైల్/సోషల్ సెల్, మరియు ప్రైవేట్ గోదాముల్లో రైతులకు రీతంగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, దేశీయంగా ఉన్న ఎరువుల కర్మాగారాలు ఉత్పత్తి కొనసాగిస్తున్నాయని తెలిపారు. అలాగే విదేశాల నుంచి కూడా అవసరమైన ఎరువులు దిగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. రైతులు కావలసిన సమయంలో కావలసిన ఎరువులు కొనుగోలు చేసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నూతనంగా రబీ పంట కాలంలో రైతులు అవసరమైన యూరియా, నాసో డీఏపీ వంటి ఎరువులను ముందుగానే అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఇవి సందేహాలుంటే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించినా, నిల్వలు దాచిపెట్టినా ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఎరువుల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లా వ్యవసాయ శాఖ పనిచేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.















Social Plugin