ఏలూరు, డిసెంబర్ 16: ధాయ్ ఆఖర్ జాతీయ స్థాయి లేఖ రచన పోటీల (2025–26) చివరి తేదీని పొడిగించినట్లు ఏలూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ సురకత్తుల శ్రీకర్ బాబు మంగళవారం తెలిపారు. తొలుత డిసెంబర్ 8, 2025తో ముగియాల్సిన ఈ పోటీల గడువును ఇప్పుడు జనవరి 31, 2026 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ పోటీలు “Letter to My Role Model” అనే అంశంపై నిర్వహించబడతాయి. పోటీలను ఎన్వలప్ కవర్ మరియు ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ (ILC) విభాగాలలో నిర్వహిస్తారు. 18 సంవత్సరాల లోపు వారు, 18 సంవత్సరాలు పైబడిన వారు అనే రెండు విభాగాల్లో విడివిడిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు.
జాతీయ స్థాయి బహుమతులు
మొదటి బహుమతి – రూ. 50,000
రెండవ బహుమతి – రూ. 25,000
మూడవ బహుమతి – రూ. 10,000
రాష్ట్ర స్థాయి బహుమతులు
మొదటి బహుమతి – రూ. 25,000
రెండవ బహుమతి – రూ. 10,000
మూడవ బహుమతి – రూ. 5,000
ఎన్వలప్ కవర్ కేటగిరీలో 1000 పదాలకు మించని విధంగా సాధారణ A-4 సైజు కాగితంపై లేఖ రాయవచ్చు. అలాగే ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ విభాగంలో 500 పదాలకు మించని పరిమితిలో ILCలో లేఖ రాయాల్సి ఉంటుంది. చేతితో రాసిన లేఖలు మాత్రమే ఈ పోటీలకు అంగీకరించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
పోటీలో పాల్గొనే వారు వయస్సు ధృవీకరణ నిమిత్తం తమ లేఖపై “I certify that I am below/above the age of 18 as on 01/01/2025” అని తప్పనిసరిగా వ్రాయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పోటీలకు అవసరమైన స్టేషనరీ సామగ్రి అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అర్హులైన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
లేఖలు పంపవలసిన చిరునామా:
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్,
ఏలూరు డివిజన్,
ఏలూరు – 534007















Social Plugin