దేశంలో ఎక్కువ మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన ఆంద్రప్రదేశ్


ఏలాంటి ఆసరాలేని లేని నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం.
జిల్లాలో 2,59,688 మందికి రూ 113.63 కోట్లు పంపిణీ. 
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ...


ఏలూరు/నూజివీడు, డిసెంబరు 01: నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో సోమవరం  ఉదయం 7గంటలకే అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర  ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లును ఇంటింటికి స్వయంగా వెళ్ళి నిరాధారణకు గురైన నిరుపేదలు యోగక్షేమాలను, ఆరోగ్య వివరాలను, గ్రామ, కుటుంబ సమస్యలను అడిగి తెలుసుకుని  రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి  లబ్ధిదారులకు నగదును స్వయంగా అందజేశారు. ముందుగా గ్రామ ప్రజలు, మహిళలు, మంత్రికి ఘనస్వాగతం పలికారు. ప్రజలు అడిగిన కొన్ని సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకే రోజున ఒకే సారి పెద్ద ఎత్తున పింఛన్లును సొమ్ముపెంచి ప్రతినెల ఇంటింటికి వెళ్ళి నిరుపేద కుటుంబాలను కలుసుకుని వారి యోగక్షేమాలు, కుటుంబ ఆరోగ్య ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకుని పింఛన్లు సొమ్ము అందజేస్తున్నామని అన్నారు. 

ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంగుటూరు మండలం ఇంటింటికి స్వయంగా వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు పింఛను సొమ్ము ఎంత అవసరమో తెలియ చెప్పటానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా  ఇంటింటికి వెళ్ళి అందజేయాలని మాకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, పనిచేసే ప్రభుత్వానికి, పనిచెయ్యని ప్రభుత్వానికి తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

ఏ ఆదరణ లేక నిరాధారణకు గురైన  వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగో లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని దీవించిన అన్ని వర్గాలు ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతోనే అభివృద్ధి, సంక్షేమ దిశగా రాష్ట్రానికి మంచి ప్రజాపాలన అందిస్తున్నామని  తెలిపారు. ఇచ్చిన పింఛన్లు సొమ్ము పొదుపుగా వాడుకుని, రేపటి అవసరాలకు కొంత సొమ్మును దాచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ, వివిధ శాఖల ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.