వెల్ఫేర్ సెక్రటరీ పై మండి పడ్డ మంత్రివర్యులు
ముసునూరు మండల E, O, P, R, D. పై మండి పడ్డ మంత్రివర్యులు
నూజివీడు/ ముసునూరు, నవంబరు 03: రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, ఆగిరపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో రైతన్నా మీకోసం పర్యటనలో భాగంగా ప్రజల నుండి అర్జీలను తీసుకొని సమస్యలను సంబంధిత అధికారులకు అదేశించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్న మంత్రివర్యులకు ప్రజల నుండి కృతజ్ఞతలు,హర్షాలు తెలియపరుస్తున్నారు.
మంత్రివర్యులకు అందిన అర్జీల్లో ముక్యంగా పింఛన్లు, ఇళ్ళ స్థలాలు, పొలం పాస్ పుస్తకాలు, గతంలో నిర్మించిన ఇళ్లకు బిల్లులు, రెవెన్యూ, విద్యుత్, వికలాంగుల పింఛను, తదితర సనస్యలను కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకొని రాగా, సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమస్యల గురించి ఫోన్లో వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రివర్యులు.
వచ్చిన సమస్యలు మినిమం సమస్యలు 90 శాతం తక్షణమే పరిష్కరిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక స్థానాన్ని పొందిన మంత్రివర్యులకు కార్యకర్తలు తమ హర్షాన్ని కృతజ్ఞతను తెలియజేస్తున్నారు. కొన్ని కొన్ని సమస్యల పరిస్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని మరియు ఎప్పటి లోపు సమస్య పరిష్కరించేది తెలియజేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రికి కార్యకర్తలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
పింఛన్లు వివరాల కోసం వెల్ఫేర్ సెక్రటరీ ని మంత్రివర్యులు 3 సార్లు పిలువగా గైరాజరై అందుబాటులో లేకపోడంతో మండిపడ్డ మంత్రవర్యులు, మరియు ముసునూరు మండలంలో ఇంటి పన్ను ఇతర పన్నులపై హెచ్చు తగ్గులపై ఫిర్యాదులు రాగా E, O, P, R, D, కి మెమో జారీ చేయమని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జి రఘు, వేణు, తదితరులు పాల్గొన్నారు.















Social Plugin