.. ఈ సీజన్ లో శబరిమలకు 200 ప్రత్యేక ట్రిప్పులు నడుపుతున్న రైల్వే శాఖ.
.. విశాఖపట్నం నుంచి 20, కాకినాడ నుంచి 18 ప్రత్యేక రైళ్లు.
.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానం.
ఏలూరు/ఢిల్లీ, డిసెంబర్ 03: మండల - మకరవిళక్కు సీజన్ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శబరిమలకు ఏపీ నుంచి సాధారణ, ప్రత్యేక రైళ్ల ద్వారా మొత్తంగా 200 ట్రిప్పులు నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ఏడాది మండల - మకరవిళక్కు సీజన్ ప్రారంభం అయిన సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి, ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడల నుంచి శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేశారా, చేస్తే ఎన్ని రైళ్లు ఏర్పాటు చేశారనే సమాచారం కోరుతూ లోక్ సభలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
దాదాపు రెండు నెలలు ఉండే ఈ సీజన్ లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే ద్వారా శబరిమలకు సాధారణ, ప్రత్యేక రైళ్ల ద్వారా మొత్తంగా 200 ట్రిప్పులు నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇందులో బాగా విశాఖపట్నం నుంచి 20 ప్రత్యేక రైళ్లు, కాకినాడ నుంచి 18 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వివరించారు.















Social Plugin