ఏలూరు జిల్లా, ఏలూరు, ద్వారకా తిరుమల: ఏలూరులో శిథిలావస్థకు చేరుకున్న టీటీడీ కళ్యాణ మండపాన్ని పునర్నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ బోర్డును జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కోరారు. ఈ మేరకు తిరుమలలో టీటీడీ ఈవో సింఘాల్ ను కలసి, కళ్యాణ మండప పునర్నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని సిఫార్సు లేఖను అందజేశారు.
స్వామి కార్యం, స్వకార్యం రెండింటినీ సమానంగా భావించే నాయకుడిగా పేరొందిన బడేటి చంటి, మరోసారి తన ప్రజాహిత దృక్పథాన్ని చాటుకున్నారు. అవకాశాలు ఉన్న చోటే కాదు, అవకాశం లేని పరిస్థితుల్లో కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగడం ఆయన నాయకత్వ శైలికి నిదర్శనమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే చంటి, ఉత్తర ద్వార దర్శనానంతరం ప్రజాహిత కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఏలూరులో 1980లో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో, దాని పునర్నిర్మాణం అత్యవసరమని టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
కళ్యాణ మండప పునర్నిర్మాణానికి సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ, టీటీడీ ఈవోతో పాటు చైర్మన్ కార్యాలయంలో కూడా వినతిపత్రాన్ని అందజేశారు. చైర్మన్ అందుబాటులో లేకపోవడంతో, అనంతరం టీటీడీ బోర్డు సభ్యుడు బీఆర్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే టీటీడీ సభ్యుడు జి. భాను ప్రకాష్ ను కూడా ఎమ్మెల్యే చంటి కలిశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లా వెంకట సత్య వరప్రసాద్, బెల్లపుకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యం కోసం, ధార్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ ప్రయత్నం స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
















Social Plugin