సంక్రాంతి ప్రత్యేకంగా ‘కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్–2026’
ఏలూరు జిల్లా, కైకలూరు: సంక్రాంతి పండుగను జూదం లేకుండా, ఆరోగ్యకరమైన వినోదం మరియు క్రీడలతో ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో కైకలూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కైకలూరు పోలీస్ ప్రీమియర్ లీగ్–2026 క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ టోర్నమెంట్‌ను కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. సంక్రాంతి సందర్భంగా పేకాటలు, కోడి పందేలు వంటి జూద కార్యకలాపాలకు దూరంగా ఉండి, యువత క్రీడల వైపు దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ క్రికెట్ పోటీలు 2026 జనవరి 6వ తేదీన ఉదయం 8.00 గంటల నుండి ఆటపాక గ్రౌండ్, కైకలూరు లో నిర్వహించబడనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే జట్లకు ఎంట్రీ ఫీజ్ పూర్తిగా ఉచితంగా ఉండటం విశేషం.
టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేయనున్నారు.
మొదటి బహుమతిగా రూ.50,000/- (నర్సిపల్లి అప్పారావు గారి సహకారంతో),
రెండవ బహుమతిగా రూ.30,000/- (రామిశెట్టి బుజ్జి గారి సహకారంతో),
మూడవ బహుమతిగా రూ.20,000/- (భుజభలపట్నం నాని & వినయ్ వర్మ గార్ల సహకారంతో) అందించనున్నారు.
అలాగే అండర్-19 విభాగంలో
మొదటి బహుమతి రూ.15,000/- (బూరుబోయిన శ్రీనివాసరావు గారి సహకారంతో),
రెండవ బహుమతి రూ.10,000/- (వీరబత్తిన సుధా గారి సహకారంతో) ప్రకటించారు.
ప్రత్యేకంగా మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్‌మన్, బెస్ట్ బౌలర్ షీల్డ్స్‌ను గెడ్డం జితేంద్ర గారు – సత్యం గారి బుక్ స్టాల్, కైకలూరు వారి సహకారంతో అందజేయనున్నారు.
బాల్స్ స్పాన్సర్‌గా పూల రాజ్ సహకారం అందిస్తున్నారు.
మరిన్ని వివరాల కోసం
శ్రీ A.V.S. రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కైకలూరు టౌన్ పీఎస్ – 94407 96434,
శ్రీ D. వెంకట్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ – 94407 96433,
ప్రసాద్ (నటరాజ్) – 94920 40888 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ…
“సంక్రాంతి పండుగను జూదం లేకుండా, సాంప్రదాయ క్రీడలు మరియు ఆరోగ్యకరమైన వినోదంతో ఆనందంగా జరుపుకుందాం. పోలీసులతో కలిసి సామాజిక బాధ్యతను పాటిద్దాం” అని పిలుపునిచ్చారు.















Social Plugin