ఏలూరు జిల్లా, ఏలూరు: కోట్లాది రూపాయలతో జరుగుతున్న ఏలూరు నగర అభివృద్ధి పనులకు నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ పూర్తి సహకారం అందించాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పిలుపునిచ్చారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురు సభ్యులకు సోమవారం మేయర్ తన చాంబర్‌లో ప్రొసీడింగ్ ఆర్డర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆశీస్సులతో స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు.
స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన గూడూరి ఆదిలక్ష్మి, కలవకొల్లు సాంబ, బత్తిన విజయ్ కుమార్, ఎర్రంశెట్టి సుమన్, దేవరకొండ శ్రీనివాసరావులకు మేయర్ నూర్జహాన్ పెదబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య సారథ్యంలో శరవేగంగా కొనసాగుతున్న నగర అభివృద్ధి కార్యక్రమాలకు నూతన సభ్యులు సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు.
ఈ సందర్భంగా నూతనంగా స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన సభ్యులు మేయర్ నూర్జహాన్ పెదబాబును శాలువా కప్పి, పూలకుండి అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, వంకదారు ప్రవీణ్, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు.















Social Plugin