ఏలూరు జిల్లా, చింతలపూడి: చింతలపూడి మండలం చింతలపూడిలోని కొవ్వూరు గూడెం గ్రామానికి చెందిన నాగదేసి థెరిసా చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
నాగదేసి థెరిసా విశ్రాంత ఉపాధ్యాయురాలు. ఉద్యోగ విరమణ అనంతరం ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి పారితోషకం ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ఈ సేవా భావంతోనే ఆమె నేడు ఆసుపత్రిలోని రోగులకు దుప్పట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొని, థెరిసా చేపడుతున్న మానవతా స్వచ్ఛంద సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఆమె సేవలు మరెందరికో ఆదర్శంగా నిలవాలని వారు ఆకాంక్షించారు.















Social Plugin