ఏలూరు: ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ పర్యవేక్షణలో మరో కీలక విజయాన్ని సాధించింది. చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన మహిళ హత్య కేసులో నేరం రుజువుకావడంతో ముద్దాయికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ ఏలూరు 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి గౌరవ న్యాయమూర్తి శ్రీమతి యు. ఇందిరా ప్రియాదర్శిని తీర్పు వెలువరించారు.
క్రైమ్ నెంబర్ 57/2023, ఎస్సీ నెంబర్ 193/2024కు సంబంధించిన ఈ కేసులో శ్రీకాకొల్లు సువర్ణరాజు (39), బందంచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి ముద్దాయిగా ఉన్నాడు. కంచర్ల సునీత @ గంగ (35)తో ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో, ఆమె ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో అసూయకు లోనై హత్యకు పాల్పడ్డాడు.
2023 జనవరి 20న చింతలపూడి మండలం బాలవారి గూడెం అడవికి మహిళను తీసుకువెళ్లి, ఆమెపై దాడి చేసి చీరతో ఉరి బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు కోర్టులో రుజువైంది. అనంతరం సాక్ష్యాలను మాయం చేయాలనే ఉద్దేశంతో శవాన్ని కొండ దిగువ రాళ్లపై పడేసినట్లు విచారణలో వెల్లడైంది.
న్యాయస్థానం సెక్షన్ 302 ఐపీసీ కింద జీవిత ఖైదు మరియు రూ.3,000 జరిమానా, సెక్షన్ 201 ఐపీసీ కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. నేరం జరిగిన మూడేళ్లలోపే శిక్ష ఖరారుకావడం విశేషంగా నిలిచింది.
మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు – ఏలూరు కోర్టు చారిత్రాత్మక తీర్పు https://t.co/KZVdlnmEUJ
— ELURU NEWS (@EluruNews90170) January 9, 2026















Social Plugin