ఏలూరు జిల్లా, పోలవరం/కొయ్యలగూడెం: ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 08వ తేదీ (గురువారం) న కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.
ఈ జాబ్ మేళాకు పోలవరం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల నుండి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ ఉద్యోగ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వాటి ద్వారా 1224 ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు. వివిధ రంగాలకు చెందిన ఉద్యోగాలు అందుబాటులో ఉండటంతో అర్హత కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం యువత ఉపాధి లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతున్నదని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

.jpeg)















Social Plugin