శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంత్రి కొలుసు పార్థసారధి ప్రత్యేక పూజలు


నూజివీడు నియోజకవర్గం / ఆగిరిపల్లి: నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం, ఆగిరిపల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథ సప్తమి సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన మంత్రి, అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, “రథ సప్తమి వంటి పవిత్ర పర్వదినాలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది” అని అన్నారు.

దేవుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా, శాంతియుతంగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు.