ఏలూరు, జనవరి 26 : జనసేన పార్టీ ఏలూరు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. నగర అధ్యక్షులు వీరంకి పండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
కార్యక్రమ ప్రారంభంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రెడ్డి అప్పల నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాలలో భారత రాజ్యాంగం ఒకటని అన్నారు. దేశ పౌరుల హక్కులను పరిరక్షించడంలో, భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిపిన ఘనత రాజ్యాంగానిదేనని తెలిపారు. డా. బి.ఆర్. అంబేద్కర్ సారధ్యంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగమని పేర్కొన్నారు.
అయితే గతంలో కొంతమంది పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, చట్టాలను తమకు అనుకూలంగా మలచుకున్న సందర్భాలు ఉన్నాయని విమర్శించారు. కానీ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజాపక్షాన చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ, ప్రజలకు దాని ఫలాలు అందేలా ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి, జనసేన పార్టీ తరఫున జనసైనికులకు, వీర మహిళలకు, మెగా అభిమానులకు, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను అందించేందుకు మహనీయులు రూపొందించిన రాజ్యాంగం సమర్థుల పాలనలోనే పరిపూర్ణత సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజాస్వామ్య సంక్షోభాన్ని రాజ్యాంగమే సరిదిద్దగలదని ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారత మాతకు జేజేలు పలుకుతూ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ సత్తిబాబు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, పేటేటి రామకృష్ణ ప్రసాద్, జనసేన రవి, లక్కింశెట్టి కిరణ్, పైడి లక్ష్మణరావు, కన్న ప్రసాద్, బుద్ధా నాగేశ్వరరావు, కీర్తి కృష్ణ నాయుడు, వాసా సాయి, కొనికి మహేష్, దేవరపల్లి రత్నబాబు, సైలాడ పూర్ణ, నాయకురాలు గుదె నాగమణి, గిడుతూరి పద్మ, కన్న దుర్గా భవానీతో పాటు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















Social Plugin