ఏలూరు జిల్లా, చాట్రాయి: నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వి ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ ఆదేశాల మేరకు ఈ నెల 21 తేదీన చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ కి అందిన సమాచారం ఆధారంగా పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో భాగంగా చనుబండ గ్రామ శివారులో పేకాట శిబిరంపై దాడి చేసి 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.40,950/- నగదు మరియు 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఆరుగొలను పేట గ్రామ శివారులో నిర్వహించిన మరో దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.15,040/- నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం 9 మంది వ్యక్తులపై చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా చాట్రాయి ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ, ప్రజలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కలిగించే జూద క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జూదాన్ని ప్రోత్సహించినా, పాల్గొన్నా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జూదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని పేర్కొన్న ఎస్సై, పేకాట తదితర జూద కార్యకలాపాలపై సమాచారం ఉన్న ప్రజలు వెంటనే డయల్ 112కు లేదా చాట్రాయి ఎస్సై ఫోన్ నంబర్ 9440796455 కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు.















Social Plugin