ఏలూరు జిల్లా,ఏలూరు: ఏలూరు విజిలెన్స్ ఎస్పీ కె. నాగేశ్వర రావు ఆదేశాల మేరకు ఏలూరు పట్టణంలో విజిలెన్స్, రెవిన్యూ, జీఎస్టీ శాఖల అధికారులు సంయుక్తంగా నిషేధిత గుట్కా, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా ఏలూరులోని
ఆకుల కొండలరావు జనరల్ స్టోర్స్
శ్రీ లక్ష్మి ప్రసన్న జనరల్ స్టోర్స్
శ్రీ సుబ్రమణ్యేశ్వర ట్రేడర్స్
సింహాద్రి కూల్ డ్రింక్స్
విజయ స్టోర్స్
అనే ఐదు దుకాణాలలో తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు, పాన్ మసాలా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు భారీగా లభ్యమయ్యాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.8,69,044/- గా అధికారులు నిర్ధారించారు.
ఈ మేరకు పై ఐదు దుకాణాల యజమానులపై జీఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. అలాగే ఈ వ్యవహారంలో క్రిమినల్ చర్యల నిమిత్తం ఏలూరు 1టౌన్ పోలీస్ స్టేషన్‌కు కేసు నమోదు చేయాలని సిఫారసు చేసినట్లు వెల్లడించారు.
ఈ సంయుక్త తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వర రావు, సీఐ డి. ప్రసాద కుమార్, గంగాభవాని, ఎస్‌ఐ చ. రంజిత్ కుమార్, కె. సీతారాము, కె. నాగరాజు, జీఎస్టీ అధికారి కె. శ్రీనివాస మూర్తి మరియు రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.















Social Plugin