.. దేశంలో ఏ పార్టీకి లేని గొప్ప క్యాడర్ తెలుగుదేశం పార్టీ సొంతం.
.. దాకరపు కృష్ణ చేరిక చింతలపూడిలో పార్టీని బలోపేతం చేస్తుంది.
.. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం.
.. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరలో ప్రారంభం.
.. పొగాకుకు ప్రత్యామ్నాయంవైపు రైతులు దృష్టి సారించాలి.
.. రాష్ట్ర అభివృద్ధి కోసం 30 ఏళ్లు టీడీపీ ప్రభుత్వమే ఉండాలి.
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం/ఏలూరు: కొత్త పాత కలయికతో గ్రూపులు లేకుండా అందరూ కలిసి పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంకి చెందిన తపస్య విద్యాసంస్థల అధినేత దాకరపు కృష్ణ టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం పట్టణంలోని స్థానిక సూర్య కళ్యాణ మండపంలో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోనే ఏ పార్టీకి లేని గొప్ప క్యాడర్ తెలుగుదేశం పార్టీ సొంతమని, పార్టీనే శాశ్వతమని, పదవులు శాశ్వతం కాదన్నారు. ప్రాజెక్టులన్నీ మూలాన పడేసి, పాసు పుస్తకాలపై నాటి సీఎం బొమ్మలు వేసుకుని వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతాంగానికి తీరని ద్రోహం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించి ఏ తప్పులు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నామన్నారు.
పోలవరం కల వచ్చే ఏడాది జూన్ నాటికి నెరవేరుతుందని ఎంపీ స్పష్టం చేశారు. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరలోనే మొదలు కానున్నాయని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసారని తెలిపారు. జంగారెడ్డిగూడెం - ఏలూరు రోడ్డు పనులు మొదలయ్యాయని, త్వరలోనే కొత్త హైవే కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇక్కడి మెట్ట ప్రాంత రైతులు పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా పామాయిల్ వంటి పంటలు సాగుచేయటానికి ప్రయత్నించాలని ఎంపీ సూచించారు.
విమాన ఇంధనంగా పామాయిల్ ఉపయోగించే రోజులు త్వరలోనే రానున్నాయని, ఆయిల్ పామ్ రైతులకు మరింత మంచి రోజులు రానున్నాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని కనీసం 30 ఏళ్లు కొనసాగిస్తే రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందనటంలో సందేహం లేదన్నారు. గుజరాత్ రాష్ట్రమే దీనికి ఉదాహరణ అన్నారు. తలపై ముద్దులు పెట్టి, కల్లబొల్లి కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని ముంచేసే నాయకులను, అటువంటి పార్టీలను ప్రజలు నమ్మవద్దని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రోత్సాహంతోనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించానన్నారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి చేరిక దాకరపు కృష్ణ కావడం సంతోషంగా ఉందన్నారు.
టీడీపీలో చేరిన తపస్య విద్యాసంస్థల అధినేత దాకరపు కృష్ణ మాట్లాడుతూ.. తాను వ్యాపార, సేవా రంగాల్లో ఉన్నప్పటికీ తమ కుటుంబం మొదటి నుంచీ టీడీపీలోనే ఉందన్నారు. యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం పట్ల ఆకర్షితమై పార్టీలో చేరుతున్నానన్నారు. పార్టీ సీనియర్ల సలహా సూచనల ప్రకారం నడుచుకుంటూ పార్టీ బలోపేతం కావడానికి తనవంతు కృషిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, మండల పార్టీ అధ్యకులు మాధవరావు, జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కిశోర్, ఇతర నేతలు పాల్గొన్నారు.
30 ఏళ్ళు టీడీపీ కూటమి ప్రభుత్వమే.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్. https://t.co/SXTAe5M2OW
— ELURU NEWS (@EluruNews90170) January 7, 2026















Social Plugin