ఏలూరు, డిసెంబర్, 9: సమాచారహక్కు చట్టం కింద అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడి ఎం. ముక్కంటి చెప్పారు. ఏలూరు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సమాచారహక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, 2005 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయ్యినా, ఇంకా అనేక పబ్లిక్ అథారిటీలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు (PIOs), ఫస్ట్ అప్పిలేట్ అథారిటీలు (FAAs) చట్టంలోని నిబంధనలపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల విధానపరమైన లోపాలు, తప్పు/అసమగ్రంగా సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పరిష్కరించబడుతున్నాయని, దీని వలన చట్టం ఉద్దేశించిన పారదర్శకత, జవాబుదారీతనం లక్ష్యాలు దెబ్బతింటున్నాయని కమిషన్ గమనించినందున సదరు విషయములపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించవలసినదిగా ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ప్రభుత్వ ఆదేశానుసారము జిల్లా యస్.సి సొసైటీ, ఏలూరు కార్యాలయంలో పౌరులకు మరియు ఉద్యోగస్తులకు సమాచార హక్కు చట్టం 2005 పై ది. 09-12-2025 @ 10.00 AMన జిల్లా యస్.సి సొసైటీ, ఏలూరు కార్యాలయము నందు అవగాహన కలిగించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సమాచారము తెలుసుకొనుట పౌరుల హక్కు – సమాచారం కల్పించుట ప్రభుత్వ భాద్యత అనే నినాదముతో జిల్లా యస్.సి సొసైటీ, ఏలూరు కార్యాలయము నుండి ఇండోర్ స్టేడియం రోడ్డు మీదుగా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ప్రజలకు సమాచారహక్కు చట్టం గురించి తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు.















Social Plugin