ఏలూరు, డిసెంబర్, 9: జిలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థుల తల్లితండ్రులు తమకు ఫిర్యాదు చేస్తున్నారని ఫుడ్ ఆఫీసర్ నారాయణ అనే పేరుతో మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు +91 7075419890, +91 8595652399 నంబర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యా శాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
నారాయణ అనే వ్యక్తి తాను ఫుడ్ ఆఫీసర్ అని మీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పధకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని, మీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే మీపై ఉద్యోగం తొలగింపు వంటి క్రమశిక్షణా చర్యలు తీసుకొనే అవకాశం ఉందని, ఆలా ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే తమకు కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, విద్యా శాఖకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బందికి +91 7075419890, +91 8595652399 నుండి లేదా ఏ నెంబర్ నుండైనా ఇటువంటి ఫోన్ వచ్చిన వెంటనే మీ ఫోన్ లో RECORDING చేసుకొని, సదరు విషయమును సంబంధిత జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వారికి నేరుగా లేదా లిఖితపూర్వకముగా ఫిర్యాదు చేయాలనీ డీఈఓ చెప్పారు. సదరు బ్లాక్ మైలర్లకు ఎటువంటి సొమ్ము చెల్లించవద్దని, వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలనీ డీఈఓ సూచించారు.















Social Plugin