ఏలూరు, డిసెంబర్, 26 : జీవితంలో ఉన్నత స్థాయి సాధించాలంటే సంకల్పం, కఠోర శ్రమ, మొక్కవోని దీక్ష, అవసరమని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. 'వీర్ బాల దివస్' కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం వట్లూరులోని సిద్దార్థ క్వెస్ట్ స్కూల్ కి విచ్చేసిన జిల్లా కలెక్టర్ ను ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తూ ఐ. ఏ. ఎస్., సాధించాలని ఆశిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు ఐ. ఏ. ఎస్., సాదించేందుకు కలెక్టర్ వెట్రిసెల్వి పడిన కష్టం, తాము ఐ. ఏ . ఎస్., సాదించేందుకు అవసరమైన మార్గదర్శకత్వంపై చర్చా కార్యక్రమం ఆసక్తిగా సాగింది.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినీ విద్యార్థులు కలెక్టర్ వెట్రిసెల్వి ఐ. ఏ ., ఎస్., సాదించేందుకు ఎలా ప్రేరణ కలిగింది, తల్లితండ్రుల సహకారం, అధ్యయన సమయాలు, ఐ.ఏ . ఎస్., సాధించిన విధానం, తదితర అంశాలను కలెక్టర్ ను అడిగి తెలుగుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ సమాజానికి మనం అనుకున్న రీతిలో సేవ చేయాలంటే ఉన్నత స్థాయితో సాధ్యమన్నారు. తాను ఐ.ఏ.ఎస్. సాధించిన విషయాన్నీ వివరిస్తూ..
తమిళనాడులో తమ కుటుంబం నివసించే జిల్లాలో తన చిన్నతనంలో వరద సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ విపత్తు నివారణకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన తీరు పరిశీలించి, దాన్ని ప్రేరణగా తీసుకున్నానని, తన తల్లితండ్రులు తనకు పూర్తిస్థాయిలో సహకరించారన్నారు. ఐ. ఏ. ఎస్., సాధించాలన్న ఒక సంకల్పం తీసుకుని, ఏకాగ్రతతో రోజుకు 14 గంటలపాటు కృషిచేసి సాదించానన్నారు. ప్రతీ సబ్జెక్టు పై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఉన్నత స్థాయి సాధించాలంటే రహస్యమేదీలేదని, ఏకాగ్రతతో చదువుపై మనస్సు లగ్నం చేసి సాధించాలన్న తపనతో చదవడమేనన్నారు. తాను ఐ.ఏ ఎస్., సాధించడంలో తన తల్లితండ్రుల ప్రోత్సాహమేనన్నారు.
ఈ సందర్భంగా ఒక విద్యార్థిని తాను డాక్టర్ అవుదామనుకున్నానని, కానీ మీరు ఇచ్చిన ప్రేరణతో ఐ. ఏ .ఎస్., సాధించే సంకల్పంతో చదువుతానని ధృడంగా చెప్పింది. ఆ విద్యార్థినితో పాటు పలువురు విద్యార్థులు, విద్యార్థినులు తాము కూడా ఐ. ఏ .ఎస్.,స్థాయికి చేరేందుకు కస్టపడి చదువుదామని కలెక్టర్ వెట్రిసెల్వి కి తెలియజేసారు.
.jpeg)















Social Plugin