రాష్ట్ర మంత్రి నిర్వహించిన ప్రజాధర్బార్ కు విశేష స్పందన.


16 ఫిర్యాదులకు పరిష్కార మార్గం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు.
కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారాలు.
రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ... 


ఏలూరు/నూజివీడు, డిసెంబరు 26: నూజివీడు రాష్ట్రమంత్రి  కార్యాలయంలో శుక్రవారం ప్రజాధర్భారు నిర్వహించి అర్జీలను రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి 16 అర్జీలను స్వీకరించారు. కొన్నిటిని అక్కడికక్కడే అధికారులకు తక్షణ ఆదేశాలిచ్చి పరిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజాధర్బారులో  వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. వార వారం నిర్వహించే ప్రజాధర్బారుకు నియోజకవర్గం నాలుగు మండలాలు నుండి ప్రజలు వస్తున్నారని, వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలు అధికారులకు పంపించడం జరుగుతుందన్నారు. 

నిర్ణీత సమయంలో అర్జీలను పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. కాలయాపన, నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత శాఖల అధికారులుపై చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే, ప్రజలు సంతృప్తిని పొందుతారని, అర్జీలు సంఖ్య తగ్గుతుందని అధికారులు మనస్సుపెట్టి అర్జీలను పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ గ్రామాలు నుండి వచ్చిన ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.