ఈ భేటీలో డీఎస్పీ రఘువీర్ కొద్దిసేపు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతూ భీమవరం డివిజన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలు చేయడం, ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోనున్న చర్యలపై వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న ఒక నెల రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొననున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలుగా నిఘా పెంచి శాంతిభద్రతలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. లా అండ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఎస్పీకి దిశానిర్దేశం చేశారు.















Social Plugin