దెందులూరు, 26: రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టిన గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకోని అనేక గ్రామాలను తిరిగి సమగ్ర అభివృద్ధి బాటలో నిలిపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.
దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
సమావేశానికి ముందు ఇటీవల దెందులూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఏలూరు పార్లమెంటు టీడీపీ కమిటీలో వివిధ పదవులు పొందిన సందర్భంగా పార్లమెంటు ఉపాధ్యక్షులు బొప్పన సుధాకర్, పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్, అధికార ప్రతినిధులు గుడిపూడి రేవతి, సంపంగి వేణుగోపాల్ తిలక్, పార్లమెంట్ సెక్రటరీ తానంకి సురేష్‌లను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో రాష్ట్రంలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రహదారులు కూడా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాన రహదారులతో పాటు గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లను మరమ్మత్తు చేయడం, పెండింగ్‌లో ఉన్న రహదారి పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలనే లక్ష్యంతో స్థానిక మౌలిక సదుపాయాలు, గ్రామాల స్థితిగతులను పరిశీలించి దామాషా ప్రాతిపదికన ప్రాధాన్యత క్రమంలో రహదారులు సహా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఈ విషయంలో స్థానిక కూటమి నాయకులు మరింత చొరవతో పనిచేయాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో ఆలస్యం జరిగిన గ్రామ సమస్యలు కూడా తప్పకుండా పరిష్కరించేందుకు ప్రభుత్వం, నాయకులు కట్టుబడి ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గారపాటి రామసీత, మండల పార్టీ అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్, నంబూరి నాగరాజు, మరడాని రవి, సీనియర్ నాయకులు కాశి బాబు, పెదవేగి సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, క్లస్టర్ ఇంచార్జిలు గుత్తా అనిల్, నేతల రవి, విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ మోరు శ్రావణి, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాస్, బీసీ సెల్ నాయకులు ఇప్పిలి వెంకటేశ్వరరావు (వై.వి.ఆర్), కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్‌తో పాటు పలు సొసైటీల చైర్మన్లు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.















Social Plugin