AGK షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘డైరెక్టర్ సానియా’కి ఘన విజయం


ఏలూరు/రాజమండ్రి: రాజమండ్రిలో నిర్వహించిన AGK షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్స్‌లో నేను రచించి దర్శకత్వం వహించిన *‘డైరెక్టర్ సానియా’* లఘు చిత్రం ద్వితీయ ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కెమెరామెన్ అవార్డులను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగ మహేష్ గారు విచ్చేయడం ఈ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.


కథాపరంగా చూస్తే, చిత్రనిర్మాణంలోని కీలకమైన క్రియేటివ్ ప్రొఫెషన్ అయిన డైరెక్షన్ రంగంలో మహిళలు మరింతగా రాణించాల్సిన అవసరాన్ని ఈ లఘు చిత్రం ప్రస్తావించింది. మహిళల ప్రతిభ, ఆత్మవిశ్వాసం, అవకాశాల ప్రాధాన్యతను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాం.


ఈ చిత్రానికి లభించిన అవార్డులు, ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశంసలు మా టీమ్ చేసిన కష్టానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇవే భవిష్యత్తులో మరిన్ని మెసేజ్ ఓరియెంటెడ్ లఘు చిత్రాలు చేయడానికి మాకు ప్రోత్సాహం కలిగిస్తున్నాయి.

ఈ చిత్ర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
—ఫిరోజ్ అహ్మద్**, డైరెక్టర్