వంగవీటి మోహన రంగాకి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి ...


ఏలూరు/ నూజివీడు, డిసెంబరు 26: నూజివీడు పట్టణంలో పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో శుక్రవారం వంగవీటి మోహన రంగా 37వ వర్దంతి సందర్బంగా రంగా విగ్రహానికే పూల దండలువేసి,  రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఘన నివాళులుఅర్పించారు.నిరుపేదలకు పండ్లు, స్వీట్సు పంచారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి ప్రజలకు వెళ్ళవేళలా అందుబాటులో ఉంటూ, పేద ప్రజల గుండెల్లో నేటికి స్థిర స్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా అన్నారు. ఆనాడు శాసన సభ్యుడిగా ఉంటూ పేద ప్రజలకు అండగా నిలిచి ఎన్నో సేవలు చేసి పేదల గుండెల్లో నేటికి చిరస్థాయిగా నిలిచారన్నారు.

ఈ కార్యక్రమంలో  రంగా అభిమానులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.