ఏలూరు, డిసెంబరు 16: ఏలూరు జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న గ్రామపంచాయతీలలో లేఅవుట్లు, భవన నిర్మాణ ప్లాన్ల రూపకల్పనతో పాటు పనుల పర్యవేక్షణ కోసం 2026 సంవత్సరానికి గాను ఆర్కిటెక్ట్, ఇంజినీర్, సర్వేయర్–1, సర్వేయర్–2లకు కొత్త లైసెన్సులు జారీ చేయడం, అలాగే పాత లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియను చేపట్టనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కె. అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వులు నెం.67, పంచాయితీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ, తేది 26.02.2002 ప్రకారం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు.
ఈ మేరకు ది. 18.12.2025 (గురువారం) నుంచి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, ఏలూరు జిల్లా, ఏలూరు నందు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పనిదినాల్లో దరఖాస్తు ఫారాలను అభ్యర్థులు ఉచితంగా పొందవచ్చని తెలిపారు. పూర్తిగా నింపిన దరఖాస్తులను అవసరమైన డిమాండ్ డ్రాఫ్ట్‌లతో కలిసి ది. 18.12.2025 నుంచి 30.12.2025 వరకు పనిదినాల్లో కార్యాలయ పనివేళల్లో స్వీకరించనున్నట్లు వెల్లడించారు. 31.12.2025 తరువాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబోవని జిల్లా పంచాయతీ అధికారి స్పష్టం చేశారు.
ఇది కేవలం లైసెన్సుల జారీ, రెన్యువల్ నిమిత్తమే విడుదల చేసిన ప్రకటన అని, ఇది ఉద్యోగ ప్రకటన కాదని అభ్యర్థులు గమనించాలని ఆమె తెలిపారు.















Social Plugin