కేంబ్రిడ్జ్ విద్య సంస్థలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి
ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి. శివ కుమార్
ఏలూరు జిల్లా, ఏలూరు: స్థానిక ఏలూరులో ఉన్న వన్ టౌన్ అగ్రహారం స్ట్రీట్ లో ఉన్న కేంబ్రిడ్జ్ పాఠశాల విద్యసంస్థ యాజమాన్యం వారు అక్రమంగా విద్యార్థులు వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తూ సెలవు రోజుల్లో కూడా విద్యార్థులకు అధికంగా తరగతులు నిర్వహిస్తూన్నారని తెలుసుకొని ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆదివారం రోజు కేంబ్రిడ్జ్ పాఠశాలకు వెళ్లి మీరు విద్యార్థుల పట్ల ప్రవర్తించేది అన్యాయమని విద్యార్థులను సెలవ రోజుల్లో కూడా మానసికంగా ఒత్తిడి చెయ్యడం సరికాదని అంటూ అడిగిన ఏఐఎస్ఎఫ్ నాయకులను కేంబ్రిడ్జ్ పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ అనే వ్యక్తి దుర్భసలాడుతూ నెట్టి వేయడం అనేది ఏఐఎస్ఎఫ్, సంఘం నుండి తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్ డిమాండ్ చేసారు.
ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రైవేట్ విద్య సంస్థల్లో జరుగుతున్న ఫీజులు దోపిడీలను వెంటనే అరికట్టాలని ముందస్తు అడ్మిషన్ చేస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మరియు విద్యార్థులు పట్ల జరిగే అన్యాయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నామని తెలియచేసారు. చర్యలు తీసుకోలేని పక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈఓ) కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు స్వీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏలూరు నాయకులు సిద్దు, సాయి, వెంకట్ పాల్గొన్నారు.















Social Plugin