భీమడోలు మండలం పూళ్ళ: గ్రామంలో పాత కక్ష్యల నేపథ్యంలో జరిగిన ఘోరమైన అల్లర్ల కేసులో పోలీసులు కేవలం 24 గంటల్లోనే ప్రధాన నిందితుడితో సహా 19 మందిని అరెస్ట్ చేశారు. ది 05.12.2025 రాత్రి కాండ్రు ఇసాక్ ఇంటి ఆవరణలోని కోళ్ల షెడ్డుకు, ఇంటి బయట ఉన్న శాంట్రో కారుకూ, పక్కనే ఉన్న బడ్డీ కొట్టుకూ నిప్పు పెట్టిన ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది.
పోలీసుల ప్రకారం, పూళ్ళ గ్రామానికి చెందిన బొల్లారపు పవన్ రాజ్ కుమార్‌కు కాండ్రు ఇసాక్‌తో పాత కక్ష్యలు ఉన్నాయని, ఈ కక్ష్యల నేపథ్యంలో పవన్ గ్రామంలోని మరికొందరిని రెచ్చగొట్టి ఇసాక్, అతని సోదరుడు కాండ్రు రాజులను గ్రామం వదిలి వెళ్లేలా చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ గుంపు ఇద్దరి ఇళ్లలోకి అక్రమంగా చొరబడి, సామాన్లు ధ్వంసం చేసి, కోళ్ల షెడ్డుకు, కారుకు, షెడ్‌కు పెట్రోల్/డీజిల్ పోసి నిప్పటించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై బాధితుడు కాండ్రు రాజు అదే రోజు రాత్రి 11 గంటలకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీస్‌స్టేషన్‌లో Cr.No: 252/25 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 329(4), 324(4), 326(f), 326(g), 189(2) r/w 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు భీమడోలు ఇన్స్పెక్టర్ యు.జే.విల్సన్ ఆధ్వర్యంలో ఎస్ఐ SK మదీనా బాషా మరియు సిబ్బంది వేగంగా దర్యాప్తు జరిపి, ది 06.12.2025 సాయంత్రం ప్రధాన నిందితుడితో పాటు మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను గౌరవ A.J.F.C.M కోర్టు, భీమడోలు ఎదుట హాజరుపర్చగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా, అనంతరం వారిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.















Social Plugin