ఏలూరు, డిసెంబర్, 26: సంక్రాంతి వరకు రైతులకు ఏ మేరకు ఎరువులు అవసరమో తెలుసుకుని ఎటువంటి కొరత లేకుండా సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో రబీ సీజన్లో ఎరువుల సరఫరాపై అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎరువులు అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా చేయాలన్నారు. జిల్లాలో సాగు జరిగే అధిక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఈ-పంట నమోదుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలకు అవసరమైన ఎరువులను ముందుగానే సరఫరా చేయాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి జిల్లాలో ఏ ప్రాంతంలోను ఎరువులకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వారం చివరిలో వచ్చే వారానికి అవసరమయ్యే ఎరువులు ముందుగానే సొసైటీలలో నిల్వ ఉండేలా వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయ, అనుబంద రంగాలు, సహకార శాఖ, మార్క్ ఫెడ్ అధికారులు సమన్వయంతో ఎరువులు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా సహకారశాఖాధికారి ఆరిమిల్లి శ్రీనివాస్, మార్క్ ఫెడ్, మండల వ్యవసాయాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.















Social Plugin