ఏలూరు, డిసెంబర్ 20: ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు.
శుక్రవారం రాత్రి ఏలూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వైసీపీకి చెందిన సుమారు 30 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు దేవరపల్లి రత్నబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల పక్షాన పోరాడిన పవన్ కళ్యాణ్ నేడు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం, జనసేన పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర అభివృద్ధి పట్ల ఉన్న దృఢ సంకల్పమే ప్రజలను ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే పార్టీగా జనసేన నిలుస్తోందని అన్నారు.
కొత్తగా పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అవినీతి, ప్రజల పట్ల నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపించిందని ఆరోపించారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేసే జనసేన పార్టీలో చేరడమే తమ లక్ష్యమని తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో విపర్తి సుధాకర్ (విద్యానగర్), పెండ్యాల అప్పన్న (శనివారపు పేట ఇందిరా కాలనీ), కరణం ఆదినారాయణ, శివ (దక్షిణపు వీధి), కొల్లెపల్లి గంగాధర్ రావు (రామానగర్ కాలనీ), గెద్దల జోసెఫ్ (వంగాయగూడెం), తిరుమలశెట్టి శ్రీనివాస్ (తూర్పు వీధి), కొడవలి దీపక్ (గవరవరం చెరువుగట్టు), పైలా కనకరాజు (లంకపేట), విజయ్ (జగజ్జీవన్ కాలనీ) తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ (పండు), నాయకులు రెడ్డి గౌరీశంకర్, నగిరెడ్డి కాశీ నరేష్, కూనిశెట్టి మురళీకృష్ణ, ఎట్రించి ధర్మేంద్ర, జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి అప్పలనాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలే జనసేన పార్టీలో చేరేందుకు తమకు ప్రేరణగా నిలిచాయని చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు.















Social Plugin